Tourist Family Movie | టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నాడు దర్శకుడు అభిషన్ జీవింత్. అయితే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ నుంచి రజనీకాంత్‌తో పాటు సూర్య, శివకార్తికేయన్ తదితరులు ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించగా.. తెలుగు నుంచి దర్శకుడు రాజమౌళి, నటుడు నాని తదితరులు ఈ సినిమాపై ప్రశంసులు కురిపించారు. అయితే తన సినిమాపై ప్రశంసలు కురిపించిన ప్రముఖులను ఇటీవలే కలుస్తున్నాడు దర్శకుడు అభిషన్. ఇటీవల నానిని కలిసిన ఇతడు తాజాగా ఆదివారం రోజున తలైవర్ రజనీకాంత్‌ని కలుసుకున్నాడు.
నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానో ఈరోజే అర్థమైంది. ఆయన(రజనీకాంత్) నా పేరు పిలిచి, నన్ను గట్టిగా హత్తుకోగానే ఒళ్లంతా పులకరించిపోయింది. ఆయన నవ్వు చూస్తే, చిన్నప్పుడు నేను చేసిన ప్రార్థనలన్నీ ఆలస్యంగా నా దగ్గరికి వచ్చినా, సరిగ్గా నాకు కావాల్సినప్పుడే వచ్చాయనిపించింది. ఎంత మంచి మనిషి, ఎంత నిరాడంబరంగా ఉంటారు! అంటూ రజనీకాంత్‌పై ప్రశంసలు కురిపించాడు అభిషన్.
The very reason I stepped into cinema feels fulfilled today. The way he called my name and hugged me – goosebumps all over. His one smile felt like every prayer I made as a child had finally arrived late but exactly WHEN I NEEDED IT. What a man, what a symbol of simplicity. pic.twitter.com/VYfDfOcdeV
— Abishan Jeevinth (@Abishanjeevinth) June 15, 2025