Tourist Family Movie | టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ప్రశంసలు అందుకున్న తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్ తాజాగా టాలీవుడ్ నటుడు నానిని కలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. ఈ రోజు నిజంగా అద్భుతమైనది! మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను నాని సర్. మీరు చాలా వినయంగా, ఒదిగి ఉండే వ్యక్తి. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా గురించి మీరు అంత వివరంగా మాట్లాడిన తీరు నాకు మరింత ప్రత్యేకంగా అనిపించిందంటూ అభిషన్ జీవింత్ రాసుకోచ్చాడు.
తమిళం నుంచి వచ్చి సూపర్ హిట్ అందుకున్న చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.90 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తలైవర్ రజనీకాంత్‌తో పాటు నటుడు శివకార్తికేయన్, ధనుష్, ఎస్.ఎస్ రాజమౌళి, సూర్య సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులు(refugee)గా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి.. శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి అనేది ఈ సినిమా కథ.
What a day! Truly honoured to have met you, @NameisNani sir. You’re such a humble and grounded person. The way you spoke about the film in such detail made it more special for me. Thank you 🙂 pic.twitter.com/pKpHbeDycQ
— Abishan Jeevinth (@Abishanjeevinth) June 14, 2025