‘నేడు సినిమా నిర్మా ణం ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. ప్రతి విషయం నిర్మాతకు ఛా లెంజింగ్గానే ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తిచేయడం, విడుదల చేయడం ఇలా అన్నీ సవాళ్లే. అయితే ఇవన్నీ ఇష్టంగా స్వీకరించి, అన్ని కష్టాలను ఎదుర్కొగలను అనే ధైర్యం ఉంటేనే సినిమా పరిశ్రమకు రావాలి’ అ న్నారు నిర్మాత శ్రీధర్ రెడ్డి, హీరో ఆది సాయికుమార్‌తో ఆయన నిర్మించిన చిత్రం ‘టాప్‌గేర్’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ‘అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకున్న హీరో ఆ ప్రాబ్లెమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎంతో ఉత్కంఠభరితంగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. ఆది సాయికుమార్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. తప్పుండా చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.