అందుకే ఈ మౌనం..!
అగ్ర కథానాయిక కియారా అద్వాణీ బ్రేకప్ లవ్ స్టోరీ ఇప్పుడు బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘షేర్షా’ చిత్రంలో తన సహనటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఈ భామ గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నది. ఈ మధ్యనే ఈ జంట విడిపోయారని ముంబయి మీడియాలో వార్తలొచ్చాయి. వీటిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది కియారా అద్వాణీ. ఇటీవల ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నా ప్రేమ వ్యవహారం గురించి బాహాటంగా మాట్లాడటం ఇష్టం లేదు.
అందుకే మౌనంగా ఉంటున్నా. ఒకవేళ నేను ఏమైనా మాట్లాడితే ఇంకా ఏం రాస్తారోనని భయంగా ఉంది. సమయం వచ్చినప్పుడు ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడతా. అందరూ అనుకున్నట్లుగా నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సంక్షోభం లేదు. అంతా సవ్యంగా సాగిపోతున్నది. వృత్తిపరంగా కూడా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నా. నిరాధారణమైన వార్తలతో నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేరు’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

