Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా సోకింది. దీంతో మహేశ్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కోవిడ్ నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా నుంచి తప్పించుకోలేకపోయా. ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. అలాగే.. డాక్టర్లను కన్సల్ట్ అయ్యా. వాళ్ల గైడెన్స్‌ను ఫాలో అవుతున్నా. గత కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోండి. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్లు ఖచ్చితంగా తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకుంటే.. కరోనా తీవ్రతను చాలావరకు తగ్గించవచ్చు. కోవిడ్ రూల్స్‌ను పాటించండి. సేఫ్‌గా ఉండండి.. అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
కాగా.. మహేశ్ బాబు ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లొచ్చారు. కొత్త సంవత్సరానికి మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో వెల్కమ్ చెప్పారు. ఆ ట్రిప్‌కు వెళ్లొచ్చిన కొద్ది రోజులకే ఆయనకు కరోనా సోకడం గమనార్హం.