Live Updates | సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) అంత్యక్రియలు ముగిశాయి. పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణ భౌతికకాయానికి వందనం చేశారు. కృష్ణకు కుమారుడు మహేశ్‌బాబు దహన సంస్కారాలు నిర్వహించాడు.
సూపర్‌స్టార్ కృష్ణ (Super Star Krishna) పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటులు కోటశ్రీనివాస రావు (KotaSrinivasaRao) వయోభారంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ కృష్ణకు కడసారి వీడ్కోలు పలికేందుకు పద్మాలయ స్టూడియోకు వచ్చారు.
సహాయకుల సహకారంతో పార్థీవదేహంపై పూలు చల్లి .. కృష్ణకు నివాళులర్పించారు. అనంతరం మహేశ్‌బాబును హత్తుకొని ఓదార్చారు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్నా.. సహనటుడికి తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన కోట శ్రీనివాసరావు వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Veteran Actor #KotaSrinivasaRao pays homage to #SuperStarKrishna garu 💔#SSKLivesOn #RIPSuperStarKrishnaGaru pic.twitter.com/6U4PMKtIkc
— Mahesh Anna Fans (@MaheshBabu_star) November 16, 2022
సూపర్ స్టార్ కృష్ణకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. పద్మాలయ స్టూడియోకు భారీ సంఖలో తరలి వచ్చారు. సూపర్‌స్టార్‌కు కన్నీటి వీడ్కోలు ఫోటోల కోసం క్లిక్ చేయండి
సూపర్ స్టార్ కృష్ణను చివరిసారిగా చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సూపర్ స్టార్ అభిమానులతో పద్మాలయ స్టూడియో కిక్కిరిసి పోయింది. ఇవాళ కూడా పలువురు సిసీ ప్రముఖులు కృష్ణ పార్థీవదేహానికి నివాళులర్పించారు. మరి కాసేపట్లో సూపర్ స్టార్ అంతిమయాత్ర ప్రాంరంభం అవుతుంది. అధికార లాంచనాలతో ప్రభుత్వం కృష్ణ అంతక్రియలను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలో ఆయన నివాసం విజయకృష్ణ నిలయం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సోమవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబసభ్యులు కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయనను కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటికి తీసుకురాగలిగినా ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణ కన్నుమూశారు.
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. కార్డియాక్ అరెస్టుతో సోమవారం తెల్లవారుజామున కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత అక్కడి నానక్‌రామ్‌గూడలోని తన నివాసమైన విజయకృష్ణ నిలయానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.
మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం స్టూడియోలోనే కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిన్న కృష్ణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా చిత్రపరిశ్రమ ఇవాళ తన కార్యకలాపాలను చేసుకుంది.
కృష్ణ భౌతిక కాయానికి స్టార్ హీరో ప్రభాస్ నివాళులర్పించిన అనంతరం మహేశ్ బాబును ఓదార్చారు. మహేశ్ బాబును వ్యక్తిగతంగా కలుసుకుని కొద్దిసేపు మాట్లాడాడు ప్రభాస్. నానక్‌రాంగూడలోని నివాసానికి కొంత ఆలస్యంగా చేరుకున్న ప్రభాస్.. మహేశ్‌ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు.
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి వెళ్లి కృష్ణ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా సూపర్ స్టార్ కృష్ణ వెలుగొందారని చెప్పారు. కృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. సింహాసనం, మోసగాళ్లకు మోసగాడు, గూఢచారి తదితర 340 కి పైగా చిత్రాలలో నటించి తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని అన్నారు. 16 చిత్రాలకు దర్శకునిగా పనిచేశారని తెలిపారు. మంత్రితో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కూడా కృష్ణ పార్ధీవ దేహం వద్ద నివాళులు అర్పించారు.
కృష్ణ పార్థీవ దేహానికి ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి నివాళులర్పించారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ..ఇండస్ట్రీలో నేనెవరికంటే ఎక్కువ కాదు..నేనెవరికంటే తక్కువ కాదు..అని ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన మహనీయుడు కృష్ణ అని అన్నారు.
ఎప్పుడు కృష్ణగారి ఆఫీస్ కళకళలాడుతూ ఉండేది. నిజంగా కృష్ణ బంగారం.. ఎంతో మంది నిర్మాతలను ఆయన నిలబెట్టారు. సక్సెస్ అయితే సంతోషం. ఒకవేళ ఫెయిల్ అయితే ఆ నిర్మాతలను పిలిచి, వారికి డేట్స్ ఇచ్చి నిలబెట్టిన మహనీయుడు, గొప్ప మనసున్న మారాజు కృష్ణ.
సూపర్ స్టార్ కృష్ణ (80) మంగళవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు సినీ చిత్ర పరిశ్రమనే కాకుండా ఘట్టమనేని కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన మృతికి సంతాప సూచికంగా తెలుగు సినీ పరిశ్రమ బుధవారం బంద్ పాటించనుంది. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం @urstrulyMahesh ను కలిసి పరామర్శించి, కృష్ణ గారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. pic.twitter.com/ypyNyD8Z6N
— TRS Party (@trspartyonline) November 15, 2022
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి టాలీవుడ్ నటులు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, మంచు విష్ణు నివాళులర్పించారు. అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి సీనియర్ నటుడు మోహన్‌బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్దకు వచ్చి సోదరా.. సోదరా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయిన మోహన్‌బాబు.. కృష్ణ మృతదేహంపై పడి బోరున విలపించారు. అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేశారు.
ప్రముఖ సినీ హీరో, నిర్మాత ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, పద్మాలయ స్టూడియోస్ అధినేతగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఐదు దశాబ్దాలకు పైగా ఆయన విశేష సేవలందించారని తన సంతాప సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
CM KCR Pays Tribute to Super Star Krishna
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సేఎం కేసీఆర్ నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాడ సానుభూతి తెలిపారు. హీరో మహేషబాబును సీఎం పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట ఆరోగ్య మంత్రి హరీష్‌రావు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్‌లు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణకు తాను వ్యక్తిగతంగా పెద్ద అభిమానినని, ఆయన ఎంతో ముక్కుసూటి మనిషని సీఎం తెలిపారు. ఎన్నో మంచి సినిమాలు తీసి సమాజానికి గొప్ప సేవ చేసిన వ్యక్తి కృష్ణ అని సీఎం గుర్తు చేసుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నివాళులర్పించారు. అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సినీ నటుడు కృష్ణ పార్థివదేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. కృష్ణ భౌతికకాయం వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మహేష్‌బాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం వెంకయ్య మాట్లాడారు. కృష్ణ మరణం విచారకరం అన్నారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు ఒక గొప్ప చిత్రంగా అభివర్ణించారు. అందులో ఆయన నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు చెప్పారు.
కృష్ణ పార్థివదేహానికి పలువురు సినీ తారలు నివాళులర్పించారు. అగ్రనటులు చిరంజీవి, వెంకటేశ్, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్, కల్యాణ్ రాం, నాగచైతన్య తదితరులు కృష్ణ భౌతికకాయం వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. నానక్‌రాంగూడలోని విజయకృష్ణ నివాసానికి చేరుకున్న కేటీఆర్.. అక్కడ కృష్ణ భౌతికకాయం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
కృష్ణ మృతిపట్ల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విచారం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసిందని అన్నారు. ఈ మేరకు మహేష్ బాబు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
— Raghavendra Rao K (@Ragavendraraoba) November 15, 2022
తెలుగు లెజెండరీ యాక్టర్ కృష్ణ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నానక్‌రాంగూడలోని విజయకృష్ణ నివాసంలో ఉన్న కృష్ణ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి, నిర్మాత సురేష్‌బాబు, సి.కల్యాణ్, నటుడు అడవి శేష్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సూచనలు చేశారు.
దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) November 15, 2022
సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మరణం సినీలోకానికి తీరని లోటన్నారు. ఆయన మరణవార్త చాలా బాధాకరమన్నారు. సినీ వృత్తిపట్ల కృష్ణకు క్రమశిక్షణ ఉండేదని చెప్పారు. కృష్ణ కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deeply saddened by the news of the passing away of Telugu cinema superstar, Ghattamaneni Krishna ji.
His unmatched professional discipline and work ethics set an example on conduct in public life. My heartfelt condolences to his family, friends and fans. pic.twitter.com/cO83w8kNiT
— Rahul Gandhi (@RahulGandhi) November 15, 2022
కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలిపారు.
తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విచారం వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deeply saddened to know about the demise of legendary Telugu actor #SuperStarKrishna garu.
Heartfelt condolences to his family & fans in this hour of grief.తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి హఠాన్మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. @urstrulyMahesh pic.twitter.com/0iCJ0TS9P1
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 15, 2022
సూపర్‌స్టార్ కృష్ణ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. కృష్ణ ఓ లెజెండరీ నటుడు అని అన్నారు. తన విలక్షణ నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Krishna Garu was a legendary superstar, who won hearts of people through his versatile acting and lively personality. His demise is a colossal loss to the world of cinema and entertainment. In this sad hour my thoughts are with @urstrulyMahesh and his entire family. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్‌రాంగూడలోని ఆయన నివాసానికి తరలించారు. కృష్ణ భౌతికకాయాన్ని ఇంటి వద్ద కాసేపు ఉంచి అనంతరం సాయంత్రం 5గంటల తర్వాత అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. చిత్రరంగంలోకి సుడిగాలిలా ప్రవేశించి ప్రత్యేకతను సొంతం చేసుకున్నారని.. రాజకీయరంగ ప్రవేశం సైతం అలాగే జరిగిందన్నారు. రాజీవ్ గాంధీపై అభిమానంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారని, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారని కేవీపీ గుర్తు చేసుకున్నారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సూపర్‌స్టార్ కృష్ణ మృతికి ఏపీ మంత్రి ఆర్కే రోజా నివాళులర్పించారు. ఘట్టమనేని కుటుంబానికి భగవంతుడు గుండె నిబ్బరం ఇవ్వాలని, సూపర్ స్టార్ అభిమానులకు, దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
ఘట్టమనేని కుటుంబానికి భగవంతుడు గుండె నిబ్బరం ఇవ్వాలని... సూపర్ స్టార్ అభిమానులకు, దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకి కృష్ణ గారి మరణం తీరని లోటు, వారి ఆత్మకు శాంతి కలగాలి. ఓ శాంతి🙏🙏🙏@urstrulyMahesh @ManjulaOfficial #SuperStarKrishnagaru 🙏 pic.twitter.com/1ybHY7z0Np
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 15, 2022
కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాప సూచకంగా పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా థియేటర్లో ఉదయం సినిమా షోలను రద్దు చేసినట్లు వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు కృష్ణ మరణం తనను బాధించిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. నటుడు మహేశ్ బాబు కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నానన్నారు. తెలుగు సినీ చరిత్రలో కృష్ణ ఓ ట్రెండ్ సెట్టర్ అని, సంచలనాలు, సాహసాలు చేయాలన్నా సూపర్ స్టార్ తర్వాత ఎవరైనా అన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం స్పందించింది. తమ కుటుంబానికి కృష్ణ మృతి తీరని లోటని తెలిపింది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కోల్పోయిన భారంతోనే గడుపుతాం అంటూ... సంతాప ప్రకటన విడుదల చేసింది.
🙏@urstrulyMahesh #Namrata #Gautam #Sitara #Manjula #Padma #Priyadharashini pic.twitter.com/7yg4x0AzgL
— GMB Entertainment (@GMBents) November 15, 2022
సూపర్‌స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానుకులకు సానుభూతిని ప్రకటించారు.
సినీ నటుడు కృష్ణ మృతికి మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. సినీ గగన నీలాకాశంలో ఆయన సూపర్ స్టార్ అన్నారు. సినీ జగత్తులో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచారన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటని పేర్కొన్నారు.
కృష్ణ మృతిపట్ల నటుడు నితిన్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త విన్న తర్వాత మాటలు రావడం లేదన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
No words to express how shocked I am today, after learning about the sudden demise of Superstar Krishna Garu. May his soul rest in peace. Sending my deepest condolences and my prayers to the whole Ghattamaneni family in these difficult times.. pic.twitter.com/VbvLutaa3w
— nithiin (@actor_nithiin) November 15, 2022
కృష్ణ మృతి పట్ల హాస్యనటుడు బ్రహ్మానందం సంతాపం ప్రకటించారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకుని, ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. ‘కృష్ణ సాహసాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గుండెధైర్యం కలిగిన నిర్మాత, మంచి నటుడు, దర్శకుడు. మంచిని ఆస్తిగా పొందిన మహా నటుడు కృష్ణ’ అని కొనియాడారు.
సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Super Star Forever.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 15, 2022
కృష్ణ మృతి పట్ల నటుడు అక్కినేని నాగార్జున సంతాపం ప్రకటించారు. చలన చిత్ర పరిశ్రమలో ప్రతి జానర్లోనూ సినిమా తీసిన ధైర్యశాలి కృష్ణ అని కొనియాడారు. ఈ మేరకు మహేశ్‌బాబు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
A Fearless man who attempted every genre!! The original cowboy of Telugu films!! I could sit with him for hours which were filled with his positivity😊 the man the legend the superstar!!#RIPSuperStarKrishnaGaru we will miss you🙏🙏🙏 pic.twitter.com/ccJlBP1CZd
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 15, 2022
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. వెండి తెరపై సూపర్ స్టార్‌గా వెలుగొందిన కృష్ణ మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
నటుడిగా,దర్శకుడిగా,నిర్మాతగా.. అల్లూరి సీతారామరాజు,కౌబాయ్,జేమ్స్ బాండ్ లాంటి ప్రయోగాలకు శ్రీకారం చుట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచి,వెండి తెరకు ప్రాణం పోసి,సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి కృష్ణ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న
2/2— Harish Rao Thanneeru (@trsharish) November 15, 2022
కృష్ణ మృతి పట్ల నటుడు రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. కృష్ణతో మూడు సినిమాలు నటించానని.. అవి ఎప్పటికీ మధుర జ్ఞాపకాలు అని గుర్తు చేసుకున్నారు. మహేశ్‌బాబు, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
గతంలో కృష్ణ, రజనీకాంత్ కలిసి ఇద్దరూ అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాల్లో నటించారు.
The demise of Krishna garu is a great loss to the Telugu film industry … working with him in 3 films are memories i will always cherish. My heartfelt condolences to his family …may his soul rest in peace @urstrulyMahesh
— Rajinikanth (@rajinikanth) November 15, 2022
సూపర్‌స్టార్ కృష్ణ మృతికి జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రకటించారు. సాహసానికి మరో పేరని పేర్కొన్నారు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికీ చిరస్మరణీయం కొనియాడారు.
కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం.
My thoughts are with Mahesh Anna and the family.
Om Shanthi. Superstar forever.
— Jr NTR (@tarak9999) November 15, 2022
ప్రముఖ నటుడు కృష్ణ ఇవాళ వేకువ జామున కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని మరికొద్దిసేపట్లో నానక్‌రామ్‌గూడలోని ఇంటికి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియంలో ఉంచనున్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మరణంపై నటుడు అల్లరి నరేశ్ సంతాపం ప్రకటించారు. ‘సూపర్ స్టార్’ అంటే అర్థం ఏంటో నేర్పించారని ట్వీట్ చేశారు. మహేశ్ బాబు, ఆయన కుటుంబం, అభిమానులకు సంతాపం తెలిపారు.
A legend like no other, Krishna Garu taught us what the aura of “Superstar” truly means. My father was one of his biggest fans. No words to express the immense loss we all feel right now. My prayers are with @urstrulyMahesh sir, his entire family and fans 🙏.
— Allari Naresh (@allarinaresh) November 15, 2022
కృష్ణ మృతిపై నటి సమంత సంతాపం ప్రకటించింది. మీరెప్పటికీ మా జ్ఞాపకాల్లో ఉంటారని ట్వీట్ చేసింది.
My heartfelt condolences to @urstrulyMahesh garu and the whole family. #RIPSuperStarKrishnaGaru 🙏
You will live forever in our memories pic.twitter.com/GG71Da2bae— Samantha (@Samanthaprabhu2) November 15, 2022
ప్రముఖ సినీ నటుడు కృష్ణ మృతికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
Woke up to the terrible news of #SuperStarKrishna Garu’s demise. Truly a legendary actor & one of the most humble stars of Telugu Film industry
Heartfelt condolences to my dear friend @urstrulyMahesh in this hour of grief. Losing both parents within a couple of months is tragic
— KTR (@KTRTRS) November 15, 2022
కృష్ణ మృతిపై నటుడు బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు ఘట్టమనేని కృష్ణ అని కొనియాడారు. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడని, గూఢచారి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి అని కొనియాడారు. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడన్నారు. ఆయన లేని లోటు తీర్చలేదనిదన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేశ్‌బాబుకు తీరని వేదన అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మాలయా స్టూడియో అధినేత, మాజీ ఎంపీ, పద్మభూషణ్ కృష్ణ మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. 350కి పైగా సినిమాలలో నటించిన అగ్రశ్రేణి నటుడని, తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రయోగాలతో నూతన ఒరవడిని సృష్టించారని కొనియాడారు. తెలుగు సినిమా పరిశ్రమకు 50 ఏండ్ల పాటు సేవలు అందించారని, తెలుగు సినీమా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా బుర్రిపాలెం బుల్లోడు నిలిచిపోతాడన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ మృతిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం ప్రకటించారు. సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న ఘట్టమనేని కృష్ణ మృతి చెందడం అత్యంత విచారకరమని, ఆయన ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.