తెలుగు హీరోల ప్రయాణ అనుభవాలతో ట్రావెల్ బేస్డ్ టాక్ షో ‘సోల్ ట్రిప్’ త్వరలో ప్రముఖ ఓటీటీలో రాబోతున్నది. గండభేరుండ ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత విజయ్ దాట్ల రూపొందించిన ఈ టాక్‌షోకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా ఇటీవలే ‘సోల్ ట్రిప్’ టాక్‌షో పోస్టర్‌ను విడుదల చేశారు. తొలి సీజన్లో జగపతిబాబు, అలీ, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వర్ష బొల్లమ్మ తదితరులు ఈ టాక్‌షోలో పాల్గొన్నారు. ఈ టాక్‌షోకు సంగీతం: సాహిత్య సాగర్, కాన్సెప్ట్-హోస్ట్-డైరెక్టర్: విజయ్ దాట్ల.