Jr NTR | ఓ వైపు ‘దేవర’.. ఇంకో వైపు ‘వార్’.. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు తారక్. ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా చకచకా జరుగుతూవుంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట ప్రశాంత్‌నీల్. కథానాయికగా రష్మిక మందన్నా దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే తారక్‌తో రష్మిక నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. ఇందులో విలన్ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందట.
దానికోసం బాలీవుడ్ నటుడు బాబీడియోల్ని కూడా కలిశారట ప్రశాంత్‌నీల్. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ ‘సలార్ – శౌర్యాంగపర్వం’ షూటింగ్‌ను మొదలుపెట్టే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ దేవర, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వగానే తారక్-ప్రశాంత్నీల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తున్నది. ప్రస్తుతమైతే ఈ సినిమా ప్రీపొడక్షన్ వర్క్ చకచకా జరుగుతున్నదని విశ్వసనీయ సమాచారం. తారక్ కెరీర్లోనే మెమరబుల్ మాస్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తానని ప్రశాంత్‌నీల్ నమ్మకంగా చెబుతున్నారు.