Deputy CM Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు జన దర్బార్ పేరుతో నేరుగా ప్రజల దగ్గరకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
కాగా రేపు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు పవన్ కల్యాణ్‌ను కలువనున్నారు. అశ్వినీదత్, చినబాబు, నవీన్ యేర్నేని, రవి శంకర్, నాగవంశి, టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య ఈ సమావేశానికి హాజరు కానున్నారని సమాచారం.
ఇటీవల ఏపీ ఎన్నికల్లో విక్టరీ విజయాన్ని అందుకున్న కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడం, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాల కారణంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించడం, టికెట్ ధరల్లో వెసులుబాటు, థియేటర్లలో ఎదురయ్యే సమస్యల లాంటి అంశాలను నిర్మాతలంతా ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.