Chittibabu | టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ఆయన 1970 జనవరి 1వ తేదీన కృష్ణా జిల్లాలోని కాజా గ్రామంలో త్రిపురనేని మహారథి, హేమలత దంపతులకు జన్మించారు. చిట్టిబాబు తండ్రి కూడా నిర్మాతనే. ఆయన వారసత్వంతోనే చిట్టిబాబు సినిమాల్లోకి వచ్చారు. ఆత్రేయ, అప్పలాచార్య వంటి రచన శాఖలో అసిస్టెంట్‌గా పనిచేశారు. తర్వాత సంతానం సినిమాతో దర్శకుడిగా మారాడు.
చిట్టిబాబు తన కెరీర్లో 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. 49 చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. 30కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా మెప్పించారు. అలాగే నిర్మాతగానూ పలు సినిమాలు చేశారు. దివంగత నటి సౌందర్యను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా చిట్టిబాబునే.