Power star | పవన్ కళ్యాణ్‌కు నిజంగానే అప్పులున్నాయా?
Power star Pawan kalyan | ఒక్క సినిమాకు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడనే ప్రచారం కూడా ఉంది. అలాంటి స్టార్ హీరోకి అప్పులు ఉన్నాయా? ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఒక్కొకరు ఒక్కోలా చెబుతుంటారు.

Power star Pawan kalyan | టాలీవుడ్ ( Tollywood )లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక్క సినిమాకు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడనే ప్రచారం కూడా ఉంది. అలాంటి స్టార్ హీరోకి అప్పులు ఉన్నాయా? ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఒక్కొకరు ఒక్కోలా చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ఐడియా లేని వాళ్లు మాత్రం ఆయనకు ఎందుకు అప్పులు ఉంటాయి? స్టార్ హీరో కదా? ఒక్క సినిమా చేస్తే చాలు వద్దన్నా కోట్లకు కోట్లు వచ్చి పడతాయని అంటుంటారు. కానీ ఆయన వ్యక్తిత్వం తెలిసినవాళ్లు మాత్రం ఆయనకు నిజంగానే అప్పులు ఉన్నాయని చెబుతుంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌తో 20 ఏండ్లుగా ట్రావెల్ చేస్తున్న నిర్మాత శరత్ మరార్.. పవర్ స్టార్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మించిన జానీ సినిమాకు శరత్ మరార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే పవర్ స్టార్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచి పవన్‌తో ఎంతో సన్నిహితంగా ఉన్న ఆయన.. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆర్థిక ఇబ్బందుల వెనక కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఎవరైనా ఇబ్బంది ఉందని వస్తే చాలు.. వెంటనే ఆర్థిక సాయం చేసి వారి కష్టాన్ని పోగొట్టడంలో పవన్ కళ్యాణ్ తనవంతు కృషి చేస్తారని శరత్ చెప్పాడు. అందుకే పవన్ ఎంత సంపాదించినా చేతుల్లో ఏమీ మిగలదని స్పష్టం చేశాడు.
భారీ అంచనాలతో అప్పట్లో విడుదలైన జానీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తనను నమ్మి డబ్బులు పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లకు అప్పట్లోనే 3 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తన కెరీర్లో ఎంతో మందికి గుప్త దానాలు చేశాడు. అందుకే ఆయన ఎంత సంపాదించినా కూడా మిగిలించింది లేదని అంటుంటారు ఆయన సన్నిహితులు. ఆరెంజ్ సినిమా సమయంలో నాగబాబు చేసిన అప్పులు పవన్ కళ్యాణ్ తీర్చేశాడు. కేవలం అప్పులు తిరిగి కట్టడానికి గబ్బర్ సింగ్ సినిమా చేశాని కూడా అప్పట్లో చెప్పాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అందులో సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదల కానుంది. 2022 లోనే హరిహర వీరమల్లు.. మరుసటి ఏడాది హరీష్ శంకర్ సినిమా విడుదల కానుంది. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

