తెలుగు ప్రేక్షకులు సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాతల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు ఎంఎస్ రాజు (MS Raju). దర్శకుడిగా, నిర్మాతగా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీస్తూ..వారికి వినోదాన్ని అందిస్తుంటారు. ఈ సీనియర్ నిర్మాత టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)ను పరిచయం చేసింది ఎంఎస్ రాజే. ఈ నిర్మాత తాజాగా మరో యువకుడిని మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు.
ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 7 డేస్ 6 నైట్స్ (7 Days 6 Nights). 16 ఏళ్ల సమర్థ్ గొల్లపూడి (Samarth Gollapudi). ఈ చిత్రానికి సంగీత స్వరాలు అందిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద సంగీత దర్శకులున్నప్పటికీ..ఎంఎస్ రాజు ప్రేక్షకులకు ట్రెండీ మ్యూజిక్ అందించాలనే ఉద్దేశంతో సమర్థ్ను మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్ రాజు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను పరిచయం చేస్తూ రిస్క్ తీసుకుంటున్నాడేమోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా ఎంఎస్ రాజు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. సమర్థ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఎంఎస్ రాజు టీం త్వరలోనే థియేటర్లలో ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ తో కలిసి సుమంత్ అశ్విన్, ఎస్ రజినీకాంత్ నిర్మిస్తున్నారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?