Dil raju Risk WIth Pushpa | పుష్ప విషయంలో దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా..?
ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు బాగా నచ్చుతాయో పర్ ఫెక్ట్‌గా అంచనా వేయగల నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు (dil raju). ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలు తీసి, భారీగానే లాభాలు ఆర్జించారు.

టాలీవుడ్ (Tollywood)లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు దిల్ రాజు (dil raju). ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు బాగా నచ్చుతాయో పర్ ఫెక్ట్‌గా అంచనా వేయగల నిర్మాతల్లో ఒకరు. ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలు తీసి, భారీగానే లాభాలు ఆర్జించారు. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న అఖండ మంచి లాభాలే తెచ్చిపెట్టింది. అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా దిల్ రాజు నెక్ట్స్ రాబోతున్న పుష్ప (Pushpa) సినిమా విషయంలో రిస్క్ తీసుకుంటున్నాడా..? అంటూ ఇపుడు టాలీవుడ్ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
దీనిక్కారణం దిల్ రాజు నైజాం రైట్స్ (nizam Area)ను భారీ మొత్తంలో అంటే రూ.35 కోట్లకు తీసుకోవడం. ఒక్క నైజాం ఏరియాలో ఇంత మొత్తం వెచ్చించడం రిస్కీ పని అంటున్నారు ట్రేడ్ పండితులు. కోవిడ్‌కు ముందు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో ఒక్క నైజాంలోనే రూ.40 కోట్లు రాబట్టి ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. అయితే థియేటర్లు ఇప్పడిప్పుడే గాడిలో పడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రూ.35 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్కును పుష్ప విషయంలో దిల్ రాజు చేరుకుంటాడా..? అన్నది ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అల్లు అర్జున్ (alluarjun)-సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో పుష్పపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఎలిమెంట్స్ భారీ స్థాయిలో సుకుమార్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత మాస్ ఎలిమెంట్స్ తో తీస్తున్న పుష్పలో ఇప్పటికే రిలీజైన పుష్పరాజ్ స్టిల్స్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. అయితే బన్నీ-సుకుమార్ క్రేజీ కాంబినేషన్ నైజాం ఏరియాలో దిల్ రాజుకు బలంగా మారుతుందా..? బలహీనతగా నిలిచిపోతుందా..? అనేది డిసెంబర్ 17న విడుదల తర్వాత తేలనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

