Tollywood | టెన్షన్స్ నుండి రిలీఫ్ కావడానికి సినిమా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పట్లో చాలా మంది కూడా టెన్షన్ రిలీఫ్ కోసం ఇంట్రెస్టింగ్ సినిమాలని వీక్షిస్తుంటారు. అయితే ప్రేక్షకుల నాడిని పట్టిన దర్శక నిర్మాతలు వారికి నచ్చేలా వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. వాటిలో చిన్న బడ్జెట్ చిత్రాలు ఉంటున్నాయి, పెద్ద బడ్జెట్ చిత్రాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి షూటింగ్‌లు జరుపుకుంటుండగా, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. 2025 లో బడా హీరోల సందడి కాస్త తక్కువగానే ఉంది.
వచ్చే ఏడాది మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలంతా కూడా థియటేర్స్లో తెగ సందడి చేయనున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రేక్షకులని పలకరించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీకి పోటీగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు మార్చిలో సందడి చేయనున్నాయి. ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న చిత్రం సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ.. సమ్మర్ కి రిలీజ్ కానుందని అంటున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కనున్న మూవీ కూడా 2026లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి కొందరు హీరోలు కూడా తమ సినిమాలని 2026లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా రిలీజ్ వచ్చే ఏడాది కష్టం కాని 2027 మొదట్లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ , మిడ్ రేంజ్, చిన్న హీరోల సినిమాలు కూడా 2026లో రానున్నాయి. మొత్తానికి 2026 మూవీ లవర్స్‌కి పండగలా మారనుంది.