Tollywood| ఒకప్పుడు కొందరు హీరోలు ఏడాదికి ఐదారు సినిమాలకి పైగానే చేశారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోలు ఒక్క సినిమాకి దాదాపు రెండు మూడేళ్లు సమయం తీసుకుంటున్నారు. ఇలా సినిమాలు చేస్తుండడం అభిమానులకి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఉరుకులు పెడుతున్నాయి. యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు .. రామ్ చరణ్ సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడు. మూడ్నెల్ల క్రితం మొదలైన రామ్ చరణ్ 16వ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుకున్నట్టు సమాచారం.
ఇటీవల జాన్వీ కపూర్ తో నైట్ షూట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ సినిమాని చాలా ఫాస్ట్ గా పూర్తిచేసి ఎలాగైనా దసరాకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఎప్పుడు నిదానంగా సినిమాలు పూర్తి చేసే జక్కన్న మహేష్ సినిమాని మాత్రం పరుగులు పెట్టిస్తున్నాడట. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అయ్యారు.వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మొదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటుంది.
ఎన్టీఆర్ వార్ 2 కూడా చేస్తుండగా, ఇటీవల హృతిక్ గాయపడడంతో వార్2కి కాస్త బ్రేక్ పడింది. దాంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని స్పీడప్ చేసే అవకాశం ఉంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ మరి కొద్ది రోజులలో పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి చిత్రం, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు చేయనున్నాడు. ఇక ఇటీవలి కాలంలో బాలయ్య ఎంత ఫాస్ట్‌గా సినిమాలు చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా మహాకుంభమేళాలో మొదలు కాగా, ఈ మూవీని మరో ఆరు నెలల్లో పూర్తి చేయనున్నాడట. నాని కూడా తన సినిమాల్ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. హిట్ 3 సినిమాని మొదలుపెట్టి ఇప్పటికే క్లైమాక్స్ కి తెచ్చేసిన నాని ఇటీవల ది ప్యారడైజ్ అనే సినిమాని కూడా మొదలు పెట్టేశారు. ప్యారడైజ్ రిలీజ్ కి ఇంకా సంవత్సరం టైమున్నా ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నాని అనుకుంటున్నాడట. ఇలా కొందరు హీరోలు చకాచకా షూటింగ్ పూర్తి చేస్తుండగా, మిగతా హీరోలు కూడా ఇలా చేస్తే బాగుండని వారి అభిమానులు కోరుకుంటున్నారు.