Tollywood | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుందని ప్రకటించగా, కొద్ది రోజుల ముందు థియేటర్స్ బంద్‌కి పిలుపునిచ్చారు. ఆ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో హెచ్చరికలు చేశారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ పెద్దలు దిగి వచ్చారు. ఏపీ ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం సరికాదని చంద్రబాబుతో భేటి అయి తమ సమస్యల గురించి చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టాలీవుడ్ లో పలువురికి ఫోన్స్ చేసి మీటింగ్ కి ఆహ్వానించారు కూడా. చంద్రబాబుని నాలుగు గంటలకి కలవాల్సి ఉండగా, అంతకముందు పవన్ కళ్యాణ్‌ని కలవాలని అనుకున్నారట.
సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసే లిస్ట్ లో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు, హీరోలు.. బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని.. ఇలా దాదాపు 35 నుంచి 40 మంది ఉన్నారట. అయితే ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉండగా, ఈ కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తుంది. మీటింగ్ కి రావాల్సిన ముఖ్యమైన వారు ఈ రోజు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు అయినట్టు తెలుస్తుంది.సీఎం, డిప్యూటీ సీఎం ప్రభుత్వం ఆహ్వానం అందించిన కూడా టాలీవుడ్ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశం కూడా వాయిదా వేసినట్టు సమాచారం. కాగా, కొద్ది రోజుల క్రితం సింగిల్ స్క్రీన్స్‌లో పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల బంద్ దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. దీని వెనుక సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతలుగా ఉంటూ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను శాసిస్తున్న నలుగురి పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే హరిహర వీరమల్లు రిలీజ్‌కు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీని వెనుకున్న గుట్టు రట్టు చేయాల్సిందిగా మంత్రి కందుల దుర్గేష్‌ను ఆదేశించడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. దాంతో థియేటర్ల బంద్ ఉండదని ఫిలిం ఛాంబర్ ప్రకటన చేసింది. అలాగే బంద్ నిర్ణయం వెనుక తాము లేమని దిల్‌రాజు, అల్లు అరవింద్‌లు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే తనకు సినీ పరిశ్రమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా కనీసం సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుని కలవలేదని మండిపడ్డారు.