Vijay Devarakonda Rashmika | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరూ నోరు విప్పకపోయినప్పటికీ.. వీరు సోషల్‌మీడియాలో పోస్టు చేసే ఫొటోలు మాత్రం ఈ విషయాన్ని చాలాసార్లు కన్ఫార్మ్ చేశాయి. ఏ చిన్న ఈవెంట్ జరిగినా సరే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పోస్టు చేసే ఫొటోలు ఒకే చోట దిగి, వేర్వేరుగా పోస్టు చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. తొందరలోనే పెళ్లి చేసుకుని జంటగా మారుతారని ఫ్యాన్స్ అంచనా వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజం కాబోతుంది. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు ఎంగేజ్మెంట్ జరిగింది.
ఇవాళ ఉదయం విజయదేవరకొండ, రష్మిక మందన్నకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్యనే వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో ఫేమస్ డెస్టినేషన్ ప్లేస్‌లో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. కాగా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించారు. ఇందులో గీత గోవిందం సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే ఏర్పడిన పరిచయమే ప్రేమగా చిగురించింది. అప్పటి నుంచి విజయ్ , రష్మిక ప్రేమలో ఉన్నప్పటికీ ఎప్పుడు బయటపడలేదు. కానీ వారు పెట్టిన పోస్టులు మాత్రం వారి ప్రేమ వ్యవహారాన్ని లీక్ చేశాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.