Allu Arjun -SnehaReddy | టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది అల్లు అర్జున్ -స్నేహారెడ్డి (Allu Arjun -SnehaReddy). అయితే ఈ స్టార్ జంట వివాహం జరిగి నేటికి 13 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
”హ్యాపీ యానివర్సరీ క్యూటీ. మన పెళ్లి అయ్యి 13 ఏండ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్. ఇలాంటి రోజులు నీతో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అని అల్లు అర్జున్ రాసుకోచ్చాడు. పెళ్లి రోజు సందర్బంగా బన్నీ, తన భార్య స్నేహరెడ్డితో ఉన్న అందమైన సెల్పీ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ పోస్ట్ పై పలువురు సినీ తారలు, అభిమానులు విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందమైన జంటకు అల్లు అయాన్ అల్లు అర్హా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Happy Anniversary Cutie #AlluSnehaReddy pic.twitter.com/RQfJXCzkmK
— Allu Arjun (@alluarjun) March 6, 2024
సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.