సినీ పరిశ్రమలో అవకాశాలు, ఆఫర్లు ఎప్పుడు వస్తాయో..ఎలా వస్తాయో చెప్పడం కష్టమైన పనే. సినిమాల్లోకి రావాలనుకునే కొత్త వారి సంగతి అటుంచితే కొన్ని సినిమాలు చేసి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ప్రతీసారి అవకాశాలు తలుపు తట్టే అవకాశాలుండవు. కొన్నిసార్లు ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చి ఒళ్లో వాలిపోతుంటాయి..మరికొన్నిసార్లు ఆఫర్ల కోసం వెతక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సంగతే మెహరీన్ కౌర్ (Mehrene Kaur) విషయంలో జరిగిందన్న చర్చ ఒకటి ఇపుడు ఫిలింనగర్ లో జోరుగా నడుస్తోంది.
మోహరీన్ ఇటీవలే మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి (Manchi rojulu Vachhai) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. యువ యాక్టర్ సంతోష్ శోభన్ (Tollywood) హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా ఆఫర్ మెహరీన్ ను వెతుక్కుంటూ వచ్చింది కాదట. మెహరీనే ఆఫర్ కోసం మారుతికి కాల్ చేసిందట. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఏదైనా చిన్న సినిమాలో అయినా సరే నటించే అవకాశంఇవ్వాలనిమెహరీన్ కోరగా..ఆమెకు మారుతి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడని టాక్.
గతంలో భలె భలె మగాడివోయ్ సినిమాతో యూవీ క్రియేషన్స్ తో మారుతికి మంచి అనుబంధం ఏర్పడింది. వారితో మాట్లాడిన మారుతి ఈ చిత్రంలో మెహరీన్‌ను హీరోయిన్ గా తీసుకున్నాడని టాలీవుడ్ సర్కిల్ టాక్. మొత్తానికి ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నా కూడా మెహరీన్ చిన్న సినిమాలోనైనా నటించేందుకు రెడీ కావడం వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా..? లేదా సరైన అవకాశాలు లేకపోవడం వల్లే అలా చేసిందా అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్