Tollywood | ఈ టైటిల్ చూసి ఒక్కసారి ఉలిక్కిపడి ఉంటారు. ఎంత స్టార్ హీరోయిన్ అయిన కూడా రూ. 2400 బిస్కెట్స్ అంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. అయితే ఈ ధర మనదేశంలో కాదులేండి. భారత్‌లో అత్యంత చవకైన ఆహార పదార్థంగా, ప్రతి ఇంట పిల్లలు, పెద్దలు అంత్యంత ఇష్టంగా తినే పార్లే జీ బిస్కెట్లు మన దేశంలో కేవలం లో 5 రూపాయలకు దొరుకుతాయి. అయితే బిస్కెట్ ప్యాకెట్ ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరిన గాజాలో 500 రెట్లు ఎక్కువగా రూ. 2,400కి పెరిగి అది కూడా అత్యంత కష్టంగా లభ్యమవుతున్నది. రీసెంట్గా ఓ వ్యక్తి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్‌ను 24 యూరోలకు పైగా(రూ. 2,342) చెల్లించి కొన్నానని తెలిపాడు.ఇప్పుడు అదే బిస్కెట్‌ని పూజా హెగ్డే తింటుంది.
తాజాగా విహార యాత్రలో ఉన్న ఈ ముద్దుగుమ్మ పార్లేజీ బిస్కెట్స్ తింటూ కనిపించింది. తాజాగా ఈ భామ చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేస్తూ… పార్లేజీ బిస్కెట్స్ ముంచుకొని తింటున్న వీడియో షేర్ చేసింది. చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటున్నా అంటూ పూజా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ అమ్మడికి పార్టెజీ బిస్కెట్స్ అంత ఇష్టమా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పూజా హెగ్గే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ దురదృష్టం కొద్ది గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు.
వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.దీంతో పూజా హెగ్డేకి నిరాశే ఎదురైంది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరచడంతో ఈ అమ్మడి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ చిత్రం విజయం సాధిస్తే పూజా నిలబడుతుంది. లేదంటే ఈ అమ్మడి పరిస్థితి దారుణం అంటున్నారు నెటిజన్స్.