సెట్స్ లో మహేశ్, బాలకృష్ణ, రామ్ సందడి
కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేక చాలా కాలమే అవుతుంది. సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే పూర్తి కావాల్సిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.

కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేక చాలా కాలమే అవుతుంది. సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే పూర్తి కావాల్సిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. లాక్ డౌన్ ఎత్తివేయడంతో జులై 1 నుంచి టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా సినిమాలు మొదలుపెడుతూ వస్తున్నారు. అయితే భారీ ప్రాజెక్టుల్లో మహేశ్ బాబు, అఖండ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయోనని అందరూ కళ్లలో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.
తమ ఫేవరేట్ స్టార్ల మూవీస్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. మహేశ్ బాబు లాక్ డౌన్ తర్వాత ఫైనల్ గా సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. లొకేషన్ లో ఓ ఛైర్ పై మహేశ్ బాబు కూర్చున్న బ్యాక్ లుక్ కనిపిస్తుండగా..ఎదురుగా డైరెక్టర్ పరశురాం ఉన్నాడు. పరశురాం సెట్స్ లో మహేశ్ కు సీన్ వివరిస్తున్నట్టుగా స్టిల్ ఉంది. సర్కార్ వారి పాట రీస్టార్ట్ అయినట్టు తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు అఖండ. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్టు కొట్టి బాక్సాపీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది అఖండ. లాక్ డౌన్ కు ముందు మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి బోయపాటి అండ్ టీం చిత్రీకరణ రీస్టార్ట్ చేసింది. మేకర్స్ షూటింగ్ మొదలైనట్టు బాలయ్య, బోయపాటి లొకేషన్ లో ఉన్న స్టిల్ ను షేర్ చేశారు.

మరోవైపు లింగుస్వామి డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తోన్న చిత్రం కూడా షూటింగ్ షురూ చేసింది. రామ్-లింగుస్వామి చిత్రం లాక్ డౌన్ తర్వాత ఫ్రెష్ ఫీల్‌తో చిత్రీకరణ మొదలుపెట్టింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో రామ్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.

మరోవైపు సురేందర్‌రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఏజెంట్ కూడా చిత్రీకరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి అఖిల్ స్టిల్స్ విడుదలవగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి టాలీవుడ్ హీరోలు షూటింగ్స్ మొదలుపెట్టి కరోనా, లాక్ డౌన్ తో విసుగెత్తిపోయిన మూవీ లవర్స్ లో నయా జోష్ నింపుతున్నారు.

Superstar is back in AuCTION 😎#SarkaruVaariPaata resumes its shoot 💥#SVPShootResumes 😊
— BA Raju's Team (@baraju_SuperHit) July 12, 2021
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/TZrvdn6hEM
#RAPO19 in shoot mode @ramsayz @dirlingusamy @IamKrithiShetty @ThisIsDSP @SS_Screens @sujithvasudev @NavinNooli @anbariv @PulagamOfficial #RAPO19ShootBegins pic.twitter.com/ebE62XeAnv
— BA Raju's Team (@baraju_SuperHit) July 12, 2021
ఇవి కూడా చదవండి..
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
ఐటెంసాంగ్ తో సన్నీలియోన్ సందడి
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
యూట్యూబ్‌లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

