Tollywood Heroes| ఇటీవలి కాలంలో టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలు రూపొందుతున్నాయి. వెరైటీ కథలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే ఏ కాన్సెప్ట్ అయితే జనాలకి బాగా ఎక్కుతుందో ఆ జానర్‌ని టచ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష చిత్రం క్షుద్ర శక్తుల నేపథ్యంలో రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో పలు సినిమాలు ఆ జానర్లో రూపొందుతున్నాయి. కరెక్ట్‌గా సెట్ చేస్తే పాన్ ఇండియా లెవల్లో కూడా పెద్ద హిట్ కొట్టొచ్చు. బాలీవుడ్లో ఇటీవల హారర్ మూవీస్ చాలా వచ్చాయి. అవి మంచి హిట్ కూడా కొట్టాయి. అందుకే మన హీరోలు కూడా ఆ తరహా కథలతో రెడీ అవుతున్నారు.
ఇప్పుడు అల్లరి నరేష్ ’12A రైల్వే కాలనీ’ అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీ కూడా హారర్ జానర్ సినిమానే. ఆత్మలు చుట్టూ నడిచే హారర్ కథగా తెలుస్తుండగా, ఇందులో నరేష్ ఆత్మలతో మాట్లాడే పాత్రలో కనిపించబోతున్నారు . పొలిమేర మేకర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక సుశాంత్ హీరోగా పృథ్వీరాజ్ ఓ సినిమాని తెరకెక్కిస్తుండగా, ఇందులో సుశాంత్ ది భూత వైద్యుని పాత్ర చేస్తున్నాడు .. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాగా, ఈ మూవీలో కూడా ఆత్మ, భూత వైద్యం కీలకంగా ఉంటుంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కలయికలో రాబోతున్న కొరియన్ కనకరాజ్ కామెడీ చిత్రం కూడా హారర్ టచ్ ఉన్న కథే అని తెలుస్తుంది. ఇందులో కూడా ఆత్మలు, భూత వైద్యం ప్రధానం. రాయలసీయ, కొరియన్ ఆత్మ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని మేర్లపాక సెట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక డైరెక్టర్ రమేష్ వర్మ కూడా హారర్ టచ్ తో కథని సెట్ చేశాడట. ఇందులో ముఖ్యంగా ఆత్మలు, భూతవైద్యంతోనే స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందట. ఓ యంగ్ హీరోతో ఈ సినిమాని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ రాజాసాబ్ కూడా హారర్ టచ్ ఉన్న చిత్రమే. ఇందులో మూడు తరాల ఆత్మలు, వాటి భావోద్వేగాలు, దుష్ట శక్తులు అన్ని ఉంటాయి. వాటికి కామెడీని టచ్ చేసి ప్రేక్షకులని అలరించాలని అనుకుంటున్నారట మారుతి. ఇలా ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టు మేకర్స్ సరికొత్తగా సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి వీటిలో ఏ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.