ఇటీవలే తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు షూటింగ్‌ను పూర్తి చేశాడు టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీలో పూజాహెగ్డే సోదరుడిగా కనిపించబోతున్నాడు వెంకీ. కాగా వెంకటేశ్ తర్వాత చేయనున్న తెలుగు చిత్రాన్ని ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే వెంకటేశ్ నెక్ట్స్ తెలుగు సినిమా ప్రకటించే కంటే ముందు లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. వెంకటేశ్ ఇక లీడ్ రోల్స్ కు గుడ్‌బై చెప్పనున్నాడని, సినిమాల్లో నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకోబోతున్నాడంటూ పుకార్లు కూడా హల్ చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. 2023లో కొత్త సినిమాకు సంబంధించి ప్రకటన చేయాలని అనుకుంటున్నాడట వెంకీ .
మరి ఈ వార్తలపై వెంకటేశ్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఇటీవలే యువ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రంలో కీలక పాత్రలో నటించాడు వెంకటేశ్. ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ సాగుతుంది.