టాలీవుడ్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోల్లో ముందువరుసలో ఉంటాడు వెంకటేశ్ (Venkatesh). ఈ స్టార్ హీరో ఓవైపు లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు అతిథి పాత్రల్లో కూడా మెరిసేందుకు రెడీ అంటున్నాడు. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రంలో కీ రోల్లో మెరిసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు వెంకీ. కాగా ఈ విక్టరీ హీరో మరోసారి గెస్ట్ రోల్లో కనిపించేందుకు సిద్దమవుతున్నాడన్న వార్తలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
ఇంతకీ ఏ సినిమా అనే కదా మీ డౌటు. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న హిట్ 3 (HIT 3). హిట్ మూడో పార్టుగా రాబోతున్న ఈ చిత్రంలో క్లైమాక్స్ టైంలో వెంకటేశ్ ఎంట్రీ ఉండబోతుందని అంతా తెగ చర్చించుకుంటున్నారు. అంతేకాదు హిట్ 4లో వెంకటేశ్ లీడ్ రోల్లో కనిపించనున్నాడనే వార్త మరో ఇంట్రెస్టింగ్ వార్త కూడా ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ టాక్ గాసిప్‌గానే మిగిలిపోతుందా..? నిజమవుతుందా..? అనేది చూడాలి.
వెంకటేశ్ హిట్ 2 సినిమా స్పెషల్ షో చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. శైలేష్ సినిమాను అద్బుతంగా తీశాడు. ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటుండటం ఆనందంగా ఉందని చెప్పాడు వెంకీ. శైలేష్‌ను వెంకటేశ్ ప్రశంసించి పరోక్షంగా హిట్ 3లో కనిపించబోతున్నట్టు హింట్ ఇచ్చాడని మరికొంతమంది సినీ జనాలు చర్చించుకుంటున్నారు. మరి శైలేష్ కొలను-వెంకటేశ్ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతుందనేది క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.