Raviteja Pan India Cinema | రవితేజ పాన్ ఇండియన్ దండయాత్ర..దర్శకుడెవరంటే..?
టాలీవుడ్ (Tollywood) హీరోలందరూ అన్ని భాషల్లో మార్కెట్ సంపాదించుకోవాలని విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు. పాన్ ఇండియా దండయాత్ర (Pan India Cinemas) చేస్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) హీరోలందరూ పాన్ ఇండియా దండయాత్ర (Pan India Cinemas) చేస్తున్నారు. అన్ని భాషల్లో మార్కెట్ సంపాదించుకోవాలని విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చాలా మంది హీరోలు తమ తర్వాత సినిమాలను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఇప్పుడు రవితేజ (Raviteja) కూడా ఇదే చేస్తున్నాడు. తెలుగులో ఈయనకు మంచి మార్కెట్ ఉంది. క్రాక్ ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత పెద్ద విజయం అందుకున్నాడు రవితేజ.
ఈ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో 38 కోట్లకు పైగా వసూలు చేసింది క్రాక్ సినిమా. దాంతో ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి (khiladi), ధమాకా సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో ఖిలాడి సినిమా రమేష్ వర్మ తెరకెక్కిస్తుండగా.. ధమాకా త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) రూపొందిస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఇది ఆయన నటిస్తున్న 71వ సినిమా. స్వామి రారా, కేశవ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుధీర్.. ఈ మధ్య కాలంలో సరైన సినిమా చేయలేదు.భారీ అంచనాలతో వచ్చిన శర్వానంద్ నటించిన రణరంగం డిజాస్టర్ అయింది. దానికి ముందు నాగ చైతన్యతో చేసిన దోచెయ్ కూడా అంతే. ప్రస్తుతం కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు సుధీర్ వర్మ.
ఇలాంటి సమయంలో రవితేజతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది. మరి రవితేజ పాన్ ఇండియా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సుధీర్ సినిమాలన్నీ డార్క్ స్టోరీస్, మాఫియా బ్యాక్‌గ్రౌండ్ తోనే వచ్చాయి. మరి ఈ సారి ఏం చేస్తాడో..?
ఇది కూడా చూడండి
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

