Tollywood | చూస్తుండగానే ఆగస్ట్ నెలలోకి ఎంటర్ అయ్యాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్టాఫ్ సినిమాలు అంతగా రికార్డ్స్ కొల్లగొట్టలేకపోయాయి. సెకండాఫ్‌లో పెద్ద సినిమాలు విడుదలకి ఉండగా, వాటిపై ఎక్కువ ఫోకస్ ఉంది. అయితే సినిమా లవర్స్‌కు ఈ ఆగస్ట్ నెల తెగ హడావుడిగా ఉండనుంది. చిన్న, పెద్ద సినిమాలు, రీ రిలీజ్ సినిమాలు అన్నింటితో ఈ నెల థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు క్రేజీ మూవీస్ ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముందుగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 చిత్రం ఆగస్ట్‌లోనే విడుదల కానుంది. మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ‘వార్ 2’ లో మాస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో, యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, ఆగస్ట్ 14న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.
తలైవా రజనీకాంత్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘కూలీ’ మూవీ కూడా ఆగస్ట్ 14న థియేటర్లకు రానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, పూజాహెగ్డే స్పెషల్ సాంగ్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’, వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో డైరెక్టర్‌గా భాను భోగవరపు పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నారా రోహిత్ లేటెస్ట్ ఫ్యామిలీ & లవ్ ఎంటర్టైనర్ ‘సుందరకాండ’ కూడా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
పరదా – అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 22న రిలీజ్ కానుంది. బకాసుర రెస్టారెంట్ – ప్రవీణ్, వైవా హర్ష లీడ్ రోల్స్‌లో కామెడీ హారర్ థ్రిల్లర్ కాగా, ఆగస్ట్ 8న విడుదల కానుంది. మేఘాలు చెప్పిన ప్రేమకథ – నరేశ్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ఆగస్ట్ 22న రిలీజ్ కానుంది. రివాల్వర్ రీటా – కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ ఆగస్ట్ 29న విడుదల కానుంది. పరమ్ సుందరి – జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ఈ బాలీవుడ్ మూవీ కూడా ఆగస్ట్ 29న థియేటర్లకు రానుంది. ఆగస్ట్ సినిమాల ఊపు చూస్తే, థియేటర్లలో సందడి ఖాయం.