Tollywood | సినీ పరిశ్రమ సమస్యలపై నేడు టాలీవుడ్ ప్రముఖుల భేటీ
Tollywood | తెలుగు చలన చిత్ర రంగ ప్రముఖులు, కార్మికులు.. తమ సమస్యలపై ఆదివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు.
Tollywood | తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆదివారం సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సారధ్యం వహించనున్నదని తెలుస్తున్నది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి వేళ సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటంకాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలియవచ్చింది.
ఈ సమావేశానికి రావాల్సిందిగా ఫిల్మ్ ఛాంబర్లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్, స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు. సుమారు 200 మందికిపైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ పెద్దలు చిరంజీవి, మోహన్‌బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి భేటీ కంటే ముందే ఈ సమావేశం జరుగాల్సి ఉంది. కానీ రెండు సార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈనెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో ఆదివారం జరుగనున్న సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

