Tollywood Directors New Trend | టాలీవుగ్ దర్శకులు కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టారు. ఇప్పటివరకు దర్శకులు వారి సినిమా హిట్ అయితే ఏ కంట్రీకి అయిన టూర్‌కి చెక్కేసేవారు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు ఏకంగా బ్లాక్ బస్టర్లు కొట్టి గుండు కొట్టించుకుంటున్నారు. అవును మీరు వింటుంది నిజమే. మొన్నటికి మొన్న యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి గుండు కొట్టించుకోగా.. కల్కితో నాగ్ అశ్విన్ గుండు కొట్టించుకున్నారు. ఇప్పుడు తాజాగా లక్కీ భాస్కర్‌తో వెంకీ అట్లూరి ఈ లిస్ట్‌లో చేరిపోయాడు.
గతేడాది యానిమల్ సినిమాతో వచ్చి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన కారణంగా దర్శకుడు సందీప్ తిరుమల వెళ్లి శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు.
అనంతరం కల్కితో వచ్చిన నాగ్ అశ్విన్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కల్కి. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటించారు. మే 09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల నాగ్ అశ్విన్ కూడా గుండు కొట్టించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ట్రెండ్‌లోకి వెంకీ అట్లూరి వచ్చి చేరాడు. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం స్టాక్ మార్కెట్ నేపథ్యంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.80 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల దర్శకుడు వెంకీ కూడా గుండుతో దర్శనమిచ్చాడు. అయితే ఈ ట్రెండ్ ఫ్యూచర్లో కూడా కొనసాగుతుందని తెలుస్తుంది.