HCU Issue | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విధ్వంసంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. మరోవైపు కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ వివాదంపై విరాట పర్వం సినిమా దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు.
ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. విశ్వవిద్యాలయ భూమి ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో పాటు భవిష్యత్ తరాలకు చెందినది మాత్రమే కానీ అత్యధిక ధరకు చెల్లించే వారికి కాదు. ఈ విషయం పక్కన పెట్టి ప్రభుత్వం విద్యనే అమ్మకానికి పెట్టింది. ఇది అభివృద్ధి కాదు, ఇది మన భవిష్యత్తును తాకట్టు పెట్టడం. విద్యను అందించడానికి ఉన్న స్థలలాను అక్రమంగా అమ్మేస్తుంటే ఈ అన్యాయాన్ని చూస్తూ ఉండలేము. ఈ భూ కబ్జా ఆపాలంటూ వేణు రాసుకోచ్చాడు.
University land belongs to Our students, to future generations, not to the highest bidder. But the government has put education itself on sale. This is not development, this is mortgaging our future. We cannot stand by as the spaces meant for learning are sold off for profit.… pic.twitter.com/iou9usth4x
— v e n u u d u g u l a (@venuudugulafilm) April 1, 2025