Venky Atluri Engagement | ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజలు మోగుతున్నాయి. ఉత్తరాది నుండి దక్షిణాది వరకు పలు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. రణ్‌బీర్-అలియాల పెళ్లి నుండి నయనతార-విఘ్నేష్ శివన్, నాగ శౌర్య, హన్సిక, మంజిమా మోహన్, అధితి వంటి పలువురు స్టార్‌లో పెళ్ళి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వీరి బాటలోనే టాలీవుడ్ యంగ్ దర్శకుడు పెళ్ళికి సిద్ధమవుతున్నాడు.
‘స్నేహగీతం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘తొలి ప్రేమ’ సినిమాతో దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’, నితిన్‌తో ‘రంగ్‌దే’ సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈయన ధనుష్‌తో సార్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే వివాహా బంధంలోకి అడుగుపెడుతన్నట్లు ప్రకటటించాడు.
శుక్రవారం ఈయన ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను వెంకీ అట్లూరి ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వేడుకగా ప్రముఖ నిర్మాత స్వప్న దత్ హాజరయ్యారు. ఆమెతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు ఎంగేజ్మెంట్ వేడుకకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే వెంకీ తన సతీమణి గురించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.