Prashanth Varma | విభిన్న కథలను తెరకెక్కించే అతి కొద్ది మంది దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకడు. ఈయన సినిమాలలో కథలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్లు ఉంటాయి. హలీవుడ్ తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను తన టేకింగ్‌తో మాయ చేస్తాడు. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించిన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ కాస్త నిరాశ పరిచిన జాంబిరెడ్డి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ‘జాంబిరెడ్డి’ అనే సీరియస్ కథలో హస్యాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు.
ప్రస్తుతం ఈయన ‘హను-మాన్’ అనే సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సినిమాను చేశాడు . తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో అంటూ ప్రమోట్ చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీని తర్వాత ప్రశాంత్, దానయ్య కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ‘అధీరా’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. వీటితో పాటుగా 10 మంది హీరోయిన్లతో ఓ విభిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఒక పాత్రతో మరో పాత్రకు లింక్ చేస్తూ డిఫరెంట్ స్క్రీన్‌ప్లే తో ఈ కథను రాసుకున్నాడట.
ఇవి ఇలా ఉండగానే తాజాగా ప్రశాంత్ వర్మ తను దాదాపుగా 30-34 కథలను ప్రిపేర్ చేశానని చెప్పాడు. అందులో పది బౌండెడ్ స్క్రిప్ట్‌లతో రెడీ ఉన్నాయని తెలిపాడు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలందరికి సరిపడ స్క్రిప్ట్లున్నాయని ప్రశాంత్ తెలిపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నిజంగా స్టార్ హీరోని డైరెక్ట్ చేసే చాన్స్ వస్తే ప్రశాంత్ వర్మ రేంజ్ అమాంతం పెరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.