Maruthi | టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరో పాత్రకు లోపాన్ని పెట్టి దానిలో నుండి కామెడీని పుట్టించి బ్లాక్ బస్టర్ హిట్లను సాధిస్తుంటాడు. ఒక ప్రేక్షకుడిని రెండున్నర గంటలు థియేటర్లలో హ్యపీగా ఎంటర్టైన్ చేస్తుంటాడు. అంతేకాకుండా ఈయన తన హీరోలకు కెరీర్ బెస్ట్ సినిమాలను ఇస్తుంటాడు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో రెండు, మూడు చిత్రాలు తప్ప ప్రతీది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా పలు విభాగాల్లో పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం పక్కా కమర్షియల్. గోపిచంద్, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ చేసింది.
కాగా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ పలు విషయాలను వెల్లడించారు. తాజాగా దర్శకుడు మారుతి ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మారుతి తన అభిమాన నటుడు గురించి తెలిపాడు. తనకు ప్రభాస్ అంటే అమితమైన ఇష్టం అని, ప్రభాస్‌కు తను పెద్ద ఫ్యాన్ అని వెల్లడించాడు. కాగా వీళ్ళ కాంబోలో రాజా డిలక్స్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇప్పటికే ఓ పెద్ద బంగ్లా సెట్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేశారని సమాచారం. కాగా ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ముగ్గరు హీరోయిన్లు నటించనున్నారని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్రబృందం బిజీగా ఉందట.