టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ మారుతి (Maruthi) సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా కూడా అందరినీ ఎంటర్ టైన్ చేయడంలో బిజీ అయిపోయాడు. ఈ టాలెంటెడ్ దర్శకుడు వెబ్, ఓటీటీ కంటెంట్‌తో కూడా అసోసియేట్ అవుతున్నాడు. మారుతి తాజాగా త్రీ రోజెస్ (3 Roses) టైటిల్‌తో వెబ్ సిరీస్ ను లాంఛ్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ ను ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) (SKN) నిర్మిస్తున్నారు.
మగ్గి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ షో ఆహాలో విడుదల కానుంది. త్రీ రోజెస్ సీజన్ 1 పేరుతో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లోముగ్గురు అమ్మాయిలు పబ్ లో కూర్చుని కనిపిస్తున్నారు. పోస్టర్ తోనే క్యూరియాసిటీని పెంచుతోంది మారుతి టీం. మరి ఎలాంటి స్టోరీని తెరపై చూపించబోతున్నారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. మారుతి ప్రస్తుతం చేస్తున్న మంచి రోజులు వచ్చాయి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
మరోవైపు గోపీచంద్ తో కలిసి పక్కా కమర్షియల్ చేస్తున్నాడు. రాశీఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు.
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?