Tollywood| సెలబ్రిటీలకి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల కొద్ది రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కొత్త బంగారు లోకంతో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల డేటింగ్ వ్యవహారం గురించి చర్చ నడుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల మొదట్లో పలు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆ తర్వాత డైరెక్టర్‌గా మారారు. తన రెండో సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుఅనే సినిమా చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప, పెద కాపు సినిమాలతో మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
వివాదాలకి చాలా దూరంగా ఉండే ఈ డైరెక్టర్ గురించి కొద్ది రోజులుగా నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తుంది. శ్రీకాంత్‌కి తన సతీమణితో విభేదాలు రావడంతో ఓ కోలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వారిద్దరు చెన్నైలో కలిసి ఉంటున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఈ విషయంపై కోలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు పార్ధిబన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. కోలీవుడ్‌లో పార్తీబన్ పరిచయం చేసిన హీరోయిన్ బ్రిగిడా సాగాతోనే శ్రీకాంత్ అడ్డాల రిలేషన్లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘బ్రిగిడాను నేనే సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాను కాబట్టి చాలామంది నన్ను ఈ ప్రశ్న అడిగారు. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు. .
అయితే ఆ అమ్మాయి మాత్రం మంచి నటి. చాలా కష్టమైన పాత్రను కూడా ఎంతో ఈజ్‌తో చేస్తుంది. నటన పరంగా కూడా చాలా బాగ చేస్తుంది. ఇలాంటి రూమర్స్ తాను పెద్దగా పట్టించుకోదు. ఆమె నాతో టచ్‌లో లేదు కాని ఆమె డ్రీమ్ ఇప్పుడు సినిమానే. ఇలాంటి రిలేషన్స్ పెట్టుకొని తన కెరీర్ నాశనం చేసుకోదు. వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని వస్తున్న వార్తలు అన్ని కూడా అవాస్తవాలే అని పార్తీబన్ క్లారిటీ ఇచ్చాడు. కాగా, బ్రిగిడా సాగా తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. సింధూరం, పెద కాపు-1 (2023) సినిమాల్లో ఆమె ప్రధాన పాత్రల్లో కనిపించగా, ఇందులో పెద కాపు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల నే దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే టాక్ నడుస్తుంది.