Director Bobby Father Passes Away | టాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ తండ్రి మోహన్ రావు(65) మృతి చెందాడు. గత కొంత కాలం నుండి కాలేయ సంబంధిత సమస్యతో భాదపడుతున్న మొహన్‌రావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచాడు. ఈయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బాబీ ప్రస్తుతం మెగాస్టార్‌తో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. చిరంజీవికి జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Director Bobby's father Shri Kolli Mohan Rao garu passed away due to liver disease today.
Om Shanthi pic.twitter.com/coOJhXlTFG
— BA Raju's Team (@baraju_SuperHit) August 28, 2022