Tollywood | సెప్టెంబర్ 4న వైఎస్ జగన్‌తో సినీ పెద్దల భేటీ..!
ఎన్నో రోజులుగా సినీ పెద్దలు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ని కలవడానికి చాలా కాలంగా టాలీవుడ్ ప్రముఖులు వేచి చూస్తున్నారు. చివరికి ఈ డేట్ సెప్టెంబర్ 4న ఖరారైంది.

ఎన్నో రోజులుగా సినీ పెద్దలు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ని కలవడానికి చాలా కాలంగా టాలీవుడ్ ప్రముఖులు వేచి చూస్తున్నారు. చివరికి ఈ డేట్ సెప్టెంబర్ 4న ఖరారైంది. ఈ మధ్య రెండు మూడు సార్లు జగన్ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆయన నుంచి అనుమతి రాలేదు. ఇక ఈ మధ్యే టాలీవుడ్ (Tollywood) ప్రముఖులను కలవడానికి జగన్ సుముఖత చూపించారు. అయితే అంతలోనే ఆయన పెళ్లి రోజు సందర్భంగా టూర్ వెళ్లి రావడం జరిగింది. తాజాగా వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా జనం మధ్యకు రానున్నారు జగన్. పులివెందులలో ఆయన పర్యటించనున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ పెద్దలను జగన్ కలవబోతున్నారు. ఇవన్నీ జరగడానికి మరో నాలుగు రోజులు పడుతుంది.
అందుకే సెప్టెంబర్ 4న ఈ మీటింగ్ ఫిక్స్ చేసారు. జగన్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఏ విషయాల గురించి చర్చించాలి అనే విషయంపై.. ఈ మధ్య చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో కూర్చుని సినిమా పెద్దలంతా చర్చించారు. అక్కడ ఏయే విషయాలు జగన్ ముందు ఉంచాలి.. ఏ సమస్యలను ఆయన ముందు పెట్టాలి.. వాటి పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాలపై కొన్ని రోజుల కింద చిరంజీవి ఇంట్లో నాగార్జున, ఆర్.నారాయణమూర్తి, అల్లు అరవింద్, సురేష్ బాబు (Sureshbabu) ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ లాంటి వాళ్లు కలిసి మాట్లాడారు. ఇందులో కూడా బాలకృష్ణ మిస్ కావడంతో కొందరు విమర్శించారు కూడా.
ఏదేమైనా కూడా జగన్ నుంచి స్పందన రావడంతో అక్కడ చర్చించాల్సిన విషయాలను సిద్ధం చేసుకుంటున్నారు సినీ పెద్దలు. చిరంజీవితో సహా మరో ఇద్దరు ముగ్గురు సినీ పెద్దలకు వైఎస్.జగన్మోహన్ రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి..సమస్యల గురించి ఆయన ముందు పెట్టడానికి సినీ పెద్దలు కూడా ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటివరకు కేవలం 3 షో లకు మాత్రమే అనుమతి ఉంది. అందులోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి. వీటితో పాటు టికెట్ల గురించి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ తో చర్చించడానికి చిరంజీవి టీం సిద్ధమవుతున్నారు.
కేవలం ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి మేలు చేసే మరికొన్ని విషయాలు కూడా అక్కడ చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకేసారి ఎక్కువ మంది రాకుండా అందరి తరఫున కొందరు మాత్రమే ప్రతినిధులుగా రావాలని వైఎస్ జగన్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టికెట్ రేట్ల విషయంలో తగ్గించడానికి జగన్ సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలిక.. ఏం జరుగబోతుందో..?
ఇవి కూడా చదవండి..
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

