Christmas Releases | క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల సందడి నెలకొంది. విభిన్న కథాంశాలతో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంత అయ్యాయి. అయితే ఈ చిత్రాల తొలిరోజు వసూళ్ల వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ఛాంపియన్ కలెక్షన్లలో అగ్ర స్థానంలో ఉండగా.. ఆది శంబాల, ఈషా, దండోరా చిత్రాలు తర్వాతి స్థానంలో నిలిచాయి.
1. ఛాంపియన్ రూ. 4.5 కోట్లు
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’. ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రోషన్ నటనకు మంచి మార్కులు పడటంతో, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి రోషన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా నిలిచింది.
2. శంబాల – రూ. 3.3 కోట్లు
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. సైన్స్ మరియు దైవత్వం మధ్య సాగే ఈ చిత్రం మొదటి రోజు రూ. 3.3 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద నిలకడగా కొనసాగుతోంది.
3. ఈషా – రూ. 2.18 కోట్లు
హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పణలో వచ్చిన ఈ సినిమా ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను భయపెట్టిస్తోంది. క్రేజీ ప్రమోషన్స్ కారణంగా ఈ చిత్రం తొలిరోజు రూ. 2.18 కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది.
4. దండోరా – రూ. 1.50 కోట్లు
నటుడు శివాజీ ప్రధాన పాత్రలో, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘దండోరా’. విడుదలకు ముందు వివాదాలు చుట్టుముట్టినా, విడుదలయ్యాక సినిమాలోని కంటెంట్ బాగుండటంతో పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 1.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక క్రిస్మస్ సెలవులకు తోడు న్యూ ఇయర్ హాలిడేస్ కూడా దగ్గర పడుతుండటంతో, ఈ చిత్రాల వసూళ్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.