మే నెల చివర నుంచి జూన్, జూలై, ఆగష్టు ఈ 3 నెలలు సినిమాలు రిలీజ్ కానుండగా, ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్టైన్మెంట్ దక్కుతుంది. ముందుగా జూన్ 5న కమల్ హాసన్ థగ్ లైఫ్ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత జూన్ 20న ధనుష్ కుబేర రిలీజ్ కానుంది.
ఇక కుబేర వచ్చిన వారం రోజులకు మంచు విష్ణు కన్నప్ప కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ కన్నప్ప జూన్ 27న రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఆగష్టు 1న మిరాయ్ రిలీజ్ ప్లాన్ చేయగా.. ఆగష్టు 14న సూపర్ స్టార్ రజనీ కూలీ, ఎన్టీఆర్ హృతిక్ నటించిన వార్ 2 లు పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండగా, వాటి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. ఇక ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావలసి ఉంది.
ఇక సెప్టెంబర్ 5న శివ కార్తికేయన్ మదరాసి రిలీజ్ ఫిక్స్ చేయగా, సెప్టెంబర్ చివర్లో దసరా సినిమాల సందడి మొదలు కానుంది. దసరాకి బాలయ్య అఖండ 2, సాయి తేజ్ సంబరాల యేటిగట్టు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఇదిగా రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ తెగ ఊరిస్తున్నారు కాని దాదాపు ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. చూస్తుంటే ఈ సారి దసరాకి ముందే బాక్సాఫీస్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ సాధిస్తుందో చూడాలి.