Sreeleela | అచ్చ తెలుగందం శ్రీలీల పట్టిందల్లా బంగారమవుతున్నది. టాలీవుడ్ లక్కీ ఛార్మ్‌గా ఈ భామను అభివర్ణిస్తున్నారు. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర నాయికగా రేసులో దూసుకుపోతున్నది. ఇటీవల విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రంలో విజ్జీ పాప పాత్రలో ఈ అమ్మడి అభినయానికి అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా చక్కటి సెన్సాఫ్ హ్యూమర్‌తో ఆకట్టుకునే ఈ అమ్మడు తెరపై లిప్‌లాక్ సన్నివేశాలపై తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
లిప్‌లాక్ సీన్స్‌లో తాను అస్సలు నటించనని, ఈ విషయంలో రాజీపడనని స్పష్టం చేసింది. తన మొదటి లిప్‌లాక్ భర్తకే ఇస్తానని చెప్పుకొచ్చింది. కథల ఎంపికలో క్రమంగా తన ప్రాధాన్యతలు మారుతున్నాయని, నటిగా ప్రతిభను చాటుకునే పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అగ్ర హీరోల సరసన అర డజనుకుపైగా చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.