Samantha | తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ సినిమాలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు మయోసైటీస్ వ్యాధి వచ్చింది అని తెలియగానే అభిమానులు పడిన కంగారు మాటల్లో చెప్పలేం. ఎప్పుడెప్పుడు ఆమె బయటికి వస్తుందా.. తన ఆరోగ్యం బాగుందని చెప్తుందా అని అభిమానులు వేయికళ్లతో వేచి చూశారు. హీరోలకు ఏమాత్రం తీసుకొని ఇమేజ్ ఈమె సొంతం. పైగా ఇప్పుడు సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకుంది సమంత. రెండు సంవత్సరాల కింద విడుదలైన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో ఉత్తరాదిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి సమంతకు ఆఫర్లు చాలానే వస్తున్నాయి.
అందుకే ముంబైలో సపరేట్ గా ఒక ఫ్లాట్ కూడా కొన్నది ఈ బ్యూటీ. ఇకపై తెలుగు, తమిళ సినిమాల కంటే బాలీవుడ్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది సమంత. తన అడ్రస్ కూడా కేర్ ఆఫ్ ముంబై అంటుంది. ఎక్కువగా అక్కడ దర్శక నిర్మాతలతోనే రిలేషన్ మెయింటైన్ చేస్తుంది సమంత. ప్రస్తుతం ముంబైలో మంచి పీఆర్ తెచ్చుకొని అవకాశాల వేటలో ముందుంది. ఈ నేపథ్యంలోనే రాజ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడల్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో పాటు నటిస్తుంది సమంత. దాంతో పాటు తెలుగులో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కూడా నటిస్తుంది. అయితే ఈమె డేట్స్ కోసం కొన్ని నెలలుగా విజయ్ అండ్ టీం వెయిట్ చేస్తూనే ఉన్నారు.
ఫిబ్రవరిలోనే డేట్స్ ఇస్తుంది అనుకున్నా కూడా మళ్లీ ఇప్పుడు మార్చి వరకు పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తుంది. దాదాపు 40 రోజుల పాటు ఖుషి సినిమా షెడ్యూల్లో సమంత పాల్గొనాల్సి ఉంది. అయితే ఆమె డేట్స్ ఎలా ఇస్తుందో.. సినిమా షెడ్యూల్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. మరోవైపు విజయ్ దేవరకొండ సమంత కోసం వెయిట్ చేయడం మానేసి మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఒక్కసారి ఖుషి సినిమా అయిపోయిందంటే మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ వైపు చూడకూడదని ఫిక్స్ అయిపోయింది సమంత. అందుకే కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు అల్లు అర్జున్ పుష్ప 2లో కూడా అవకాశం వస్తే కాదనుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా దక్షిణాదితో బంధం తెంపుకొని.. బాలీవుడ్ తో అదే బంధం పెనువేసుకోవాలని చూస్తుంది సమంత. మరి ఈమె ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.