సీతగా సాయి పల్లవి
నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ నాయికగా తనకో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. నాయిక ప్రధాన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ నాయికగా తనకో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. నాయిక ప్రధాన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఈ ఏడాది ‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నాయిక..ఇప్పుడు బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీలో సాయి పల్లవి సీతగా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ క్యారెక్టర్ కోసం దీపికాను సంప్రదించారు. అయితే తాజాగా సాయి పల్లవినే ఖరారు చేసినట్లు తెలుస్తున్నది.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా…మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారట. ఈ చిత్రాన్ని దర్శకులు నితేష్ తివారి, రవి ఉద్యావర్ రూపొందించబోతున్నారు. మధు మంతెన నిర్మాణ బాధ్యతలు వహిస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా..వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. సాయి పల్లవి కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రామాయణ కథతో ప్రభాస్, కృతి సనన్ జంటగా ‘ఆది పురుష్’ సినిమా రూపొందుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

