ఛాన్స్ అడిగితే ఆ స్టార్ హీరో కోరిక తీర్చమన్నాడు.. నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు
Actress Pragathi opens up on casting couch | తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలామంది ప్రముఖ హీరోయిన్లు ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. చాలామంది మౌనంగా ఉండిపోయినప్పటికీ.. కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు హీరోయిన్గా చేసి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరువిప్పింది.
తెలుగుతోపాటు సౌత్ భాషలన్నింటిలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్గా ఒకటి రెండు సినిమాలు చేసిన ఈమె.. ఇప్పుడు తల్లి, అత్త పాత్రలతో బిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన కెరీర్లో ఎదురైన ఒక చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది. సినీ కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో అవకాశాల కోసం దర్శక నిర్మాతల దగ్గరకు వెళ్తే వాళ్లు చాలా నీచంగా మాట్లాడేవారని తెలిపింది. ఒక రాత్రితో తమతో పడుకుంటేనే ఛాన్స్ దక్కుతుందనే వాళ్లని పేర్కొంది. ఛాన్స్‌ల కోసం దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా తన లైంగిక వాంఛ తీర్చాలని వేధించినట్లు సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఆ హీరో పేరు మాత్రం బయటకు చెప్పలేదు.
ఎన్నో రకాలుగా తనను ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ఎవరికీ లైంగికంగా లొంగిపోలేదని చెప్పింది ప్రగతి. అవకాశాల కోసం ఎవరి దగ్గర చేయి చాచలేదని.. ఆత్మాభిమానం చంపుకోలేదని అంటుంది. తనకు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఇంకా చాలామంది మహిళా ఆర్టిస్టులకు వేధింపులు తప్పడం లేదని.. అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్లు వేధింపులకు గురవుతున్నారని చెప్పింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తలవంచితే ఇబ్బందులు తప్పవని.. టాలెంట్ ఉంటే ఛాన్సులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని చెబుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి
“ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైరల్”
Sneha Jain: ఒక రోజు గడపాలంటూ స్నేహాకు ఫోన్ చేసిన సౌత్ దర్శకుడు”
“ముద్దుసీన్ అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు..”
“Bhoomika: కాస్టింగ్ కౌచ్ పై నటి భూమిక సంచలన వ్యాఖ్యలు..”
“Nargis Fakhri | వాళ్లతో పడుకోలేదనే ఆఫర్లు లేకుండా చేశారు”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

