Bhoomika: కాస్టింగ్ కౌచ్ పై నటి భూమిక సంచలన వ్యాఖ్యలు..

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ భూమిక చావ్లాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. యువకుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఎంతో చక్కగా తెలుగు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ కు జోడీగా ఖుషీ సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరింది. ఈ సినిమా తర్వాత ఎంతో మంది హీరోలతో యాక్ట్ చేసింది. మహేష్ బాబు సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఒక్కడు సినిమాలో కూడా హీరోయిన్ గా భూమికా నటించింది.
ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత హైప్ అయ్యింది. యోగా టీచర్ భరత్ ఠాగూర్ ని వివాహం చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. లేటెస్ట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎంసీఎ, సవ్యసాచి, పాగల్, సీటిమార్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్ లో యాక్ట్ చేసి మెప్పించింది. ఈ సందర్భంగా భూమిక లేటెస్ట్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సినీ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయా.. ప్రొడ్యూసర్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండాలా అనే ప్రశ్నకు సమాధానంగా అవన్నీ అవాస్తవాలని, నన్నెవ్వరూ అలాంటివి అడగలేదని, తనకు కథ నచ్చి, ఆ పాత్రకు నేనే బావుంటాను అంటే తన కోసం ముంబై వచ్చి మరీ మాట్లాడేవాళ్ళని చెప్పింది. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ టైమ్ లో భూమిక మాటలు ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేస్తున్నాయి. భూమిక తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

