Nargis Fakhri | వాళ్లతో పడుకోలేదనే ఆఫర్లు లేకుండా చేశారు
Nargis Fakhri | ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బయటకొచ్చి కెరీర్లో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఇప్పుడు నర్గీస్ ఫక్రీ తనకు ఎదురైన వేధింపులను బయటపెట్టింది.

Nargis Fakhri | సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ( casting couch ) సర్వసాధారణంగా మారిపోయింది. మీటూ ఉద్యమం ( Me Too movement )లో భాగంగా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బయటకొచ్చి కెరీర్లో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడించారు. అవకాశాలు కావాలంటే ఇప్పటికీ వేధింపులు ఎదురవుతున్నాయని.. ఆఫర్ల కోసం చాలామంది కాంప్రమైజ్ అవుతున్నారని చెప్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇదే బాటలో ఇప్పుడు మరో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తనకు ఎదురైన వేధింపులను బయటపెట్టింది. తనకు సినిమాల్లో ఎందుకు అవకాశాలు రాలేదో వివరించింది.
పదేళ్ల కింద ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్‌స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది నర్గీస్ ఫక్రీ. తొలి సినిమాతోనే అవార్డులు కూడా అందుకుంది. బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సూపర్ స్టార్ ఆఫ్ టుమారో-ఫీమేల్ కేటగిరీలో స్టార్ డస్ట్, జీ సినిమా అవార్డులు అందుకుంది. అలాగే ఈ సినిమాతో ఐఫా అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన మద్రాస్ కేఫ్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అలాగే కమర్షియల్ హిట్స్‌గా నిలిచిన మై తేరా హీరో, హౌజ్‌ఫుల్ 3 వంటి కామెడీ సినిమాల్లోనూ నటించింది. ఈ హిట్స్ చూసి ఈమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అంతా అనుకున్నారు.. కానీ ఆ తర్వాత నర్గీస్‌కు అసలు ఆఫర్లే రావడం తగ్గిపోయాయి. అలా ఎందుకు జరిగిందో నర్గీస్ ఫక్రీ తాజాగా చెప్పుకొచ్చింది.
ఎక్కడైనా సరే తొలి సినిమా విజయం సాధిస్తే కచ్చితంగా ఆఫర్లు వస్తాయని.. కానీ తన విషయంలో అలా జరగలేదని వాపోయింది. బాలీవుడ్లో ఎదగాలంటే దర్శక నిర్మాతల కోరికలు తీర్చాల్సిందేనని.. వాళ్లతో పడుకోకపోతే మనసులోపెట్టుకుని ఆఫర్స్ రాకుండా చేస్తారని ఆరోపించింది. తమతో పడుకుంటే తప్ప అవకాశాలు ఇవ్వమని కొందరు చెప్పేసరికి.. తను కాంప్రమైజ్ కాలేకపోయానని చెప్తోంది నర్గీస్.ఇండస్ట్రీకి వచ్చినప్పుడే తనకంటూ కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నానని.. అందువల్లే స్టార్ హీరోయిన్ కాకుండా ఇలా ఉండిపోయానని చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg Boss 5 | బిగ్‌బాస్ ఈసారి ఆరు నెలలు కొనసాగుతుందా?
మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..!
క్లీవేజ్ షోతో అదరగొట్టిన జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్
కూతురితో కలిసి సురేఖా వాణి రచ్చ మాములుగా లేదు-వీడియో
శారద మృతి అంటూ రూమర్స్.. పనికి మాలిన వాళ్లే ప్రచారం చేశారని ఘాటు కామెంట్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

