Meenakshi Chaudhary | టాలీవుడ్ యువ కథానాయిక మీనాక్షి చౌదరి, అక్కినేని హీరో సుశాంత్‌లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు మళ్లీ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై మరోసారి స్పందించింది మీనాక్షి బృందం. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవం లేదని టీమ్ తెలిపింది. మీనాక్షి చౌదరి, సుశాంత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలోని కొన్ని మీమ్ పేజీలు, వెబ్సైట్లు రెండు రోజులుగా మళ్లీ వార్తలను వైరల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది వీరి పెళ్లి అంటూ ఫొటోలు సైతం షేర్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఖండించిన మీనాక్షి, తాజాగా ఈ రూమర్స్‌పై తన టీమ్ ద్వారా మరోసారి వివరణ ఇప్పించారు. కాగా, వీరిద్దరూ కలిసి ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా నుంచే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడినట్లు సమాచారం.