Kamakshi Bhaskarla | ఇండస్ట్రీకి హీరోయిన్లు వచ్చినపుడు వాళ్ల మొదటి సినిమా ఎలా చేస్తే అదే ఇమేజ్ బలంగా పడిపోతుంది. అందులో పద్దతిగా కనిపిస్తే.. ఆ అమ్మడు అలాంటి కారెక్టర్స్ మాత్రమే చేస్తుందేమో అనుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ సినిమాలో రెచ్చిపోతే అలాంటి గ్లామర్ ఇమేజ్ వచ్చేస్తుంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాలో చాలా పద్దతిగా కనిపించి.. బయట మాత్రం నెక్ట్స్ లెవల్లో రెచ్చిపోతుంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆమెవరో కాదు.. కామాక్షి భాస్కర్ల. ఈ పేరు విన్న వాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మా ఊరి పొలిమేర హీరోయిన్ అంటే బాగా గుర్తు పడతారు కామాక్షిని. నిజానికి ఈమె డాక్టర్.. ఆ తర్వాత యాక్టర్ అయింది.
ప్రియురాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కామాక్షి. అయితే ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికి తెలియదు. కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో హాస్పిటల్లో కొంతకాలం డాక్టర్‌గా పని చేసింది. ఆ తర్వాత మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణగా ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల.. హీరోయిన్గా మారి వచ్చిన ప్రతీ ఛాన్సును యూజ్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈమె నటించిన విరూపాక్ష, పొలిమేర 2, మంగళవారం లాంటి చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి.
ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన కామాక్షి.. ఫస్ట్ టైమ్ ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఈమె ఫోజులు చూసి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. కామాక్షి ఇచ్చిన ఫోజులు చూసి వామ్మో ఈ భామ ఏంటి అంతగా రెచ్చిపోయింది అనుకుంటున్నారు. కామాక్షి భాస్కర్ల ఫోజులు చూసి కుర్రాళ్ళకి కంటిమీద కునుకు కూడా రావట్లేదు. తాజాగా బికినీకి తక్కువ కాని డ్రెస్‌లో రెచ్చిపోయింది కామాక్షి. ఈమె ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. పొలిమేరలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇచ్చిన పోజులు చూసి గ్లామర్ ఛాన్సులు కూడా వస్తాయనడంలో సందేహం లేదు. చూడాలిక.. !