Actress Ileana D’Cruz | గోవా బ్యూటీ ఇలియానా మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. గర్భం దాల్చిన్నుంచి బేబి బంప్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునే ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ తొమ్మిదో నెల నడుస్తొందని.. గర్భంతో ఏ పనిచేయలేకపోతున్నానని, ఒంట్లో ఎంతో నీరసంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కోంది. అయితే ఇప్పటివరకు ఆ బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఇలియానా వెల్లడించలేదు. ఆమధ్య చేతిలో చేయి వేసిన ఫొటోను, ఆ తర్వాత కొన్ని రోజులకు బ్లర్ చేసిన ప్రియుడి ముఖాన్ని చూపిస్తూ పోస్టులు పెట్టింది. కానీ ఆయన ఫోటోను మాత్రం ఇప్పటివరకు చూపించలేదు.
ఎట్టకేలకు ఈ బ్యూటీ తన ప్రియుడి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. డేట్ నైట్ అంటూ లవ్ సింబల్‌ను జత చేసి ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను మొదటి సారి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఎవరు అనే విషయాన్ని మాత్రం గోవా బ్యూటీ చెప్పలేదు. ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానాతొలి సినిమాతోనే తెలుగులో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
అయితే ఇలియానా దూకుడు ఎక్కువ రోజులు ఇక్కడ సాగలేకపోయింది. ఒకానొక దశలో వరుస పరాజయాలు పలకరించాయి. గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే.. ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేశారు. దాంతో మకాం ముంబైకి షిఫ్ట్ చేసింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఒకటి, రెండు సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. దాంతో గత కొంత కాలంగా ఇలియానా కెరీర్ అడపా దడపాగా సాగుతుంది.