Tollywood | టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ ఇటీవల కట్నం వేధింపుల కేసు కారణంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ‘సిందూరం’, ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాల్లో నటించిన ధర్మపై ఆయన భార్య గౌతమి తీవ్ర ఆరోపణలు చేస్తూ గచ్చిబౌలిలోని మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను కట్నం కోసం వేధిస్తున్నాడని, మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని గౌతమి ఆరోపించారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ, 2013 నుంచి ధర్మ మహేష్‌తో తనకు పరిచయం ఉందని, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. కానీ సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మహేష్ ఉమెనైజర్గా మారిపోయాడని, తాను నటించిన హీరోయిన్లు తరచూ ఇంటికి వచ్చేవారని ఆమె వెల్లడించారు.
“నువ్వేమైనా వందల కోట్లు కట్నం తెచ్చావా? మా అబ్బాయికి తగిన స్థాయి నీది కాదు” అంటూ మహేష్ పేరెంట్స్ తీవ్రంగా వేధించేవారని తెలిపారు. దీంతో పాటు, భర్త నటుడిగా మారిన తరువాత చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసయ్యాడని గౌతమి ఆరోపించారు.తన భర్త ధర్మ మహేష్ తరచూ తనను చంపుతానని బెదిరిస్తున్నాడు. “తన ప్రొటెక్షన్ కోసమే ఫైట్ చేస్తున్నా, అతడితో ఇక జీవితం కొనసాగించేది లేదు” అని గౌతమి తేల్చి చెప్పారు. వాళ్లకు వారి ఇష్టం వచ్చినట్లు జీవించొచ్చు. కానీ నా జీవితం నాశనం చేసే హక్కు వారికి లేదు. న్యాయ వ్యవస్థ మీద నాకెన్నడూ నమ్మకమే ఉంది. నాకు, నా బిడ్డకు భద్రత కోరుకుంటున్నా అని ఆమె పేర్కొన్నారు.
ధర్మ మహేష్ అక్కే అతనికి చెడు అలవాట్లు నేర్పించిందని, తల్లిదండ్రులు కొడుకునే తప్పు మార్గంలో నడిపిస్తున్నారని గౌతమి ఆరోపించారు. అతను పసిపిల్లడు కాదు. తన చర్యలకు అతడే బాధ్యత వహించాలి. అతనికి ఎవరు లీగల్ సపోర్ట్ ఇస్తున్నారో తెలుసుకోవాలనిపిస్తోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది పెద్దలు కూడా ధర్మ మహేష్‌ను కంట్రోల్ చేయలేకపోయారని గౌతమి చెబుతుండగా, ధర్మ ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తాడు అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ ధర్మ మహేష్ నుంచి అధికారిక స్పందన రాకపోయినా, ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పెళ్లైన కొత్తలోనే ధర్మకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండేవని, ఇంట్లో వస్తువులు పగలగొట్టేవాడని, తన కారు డోర్‌ను కూడా విరగ్గొట్టాడని గౌతమి చెప్పారు. పబ్లిక్ ఇమేజ్ కోసం నటుడిగా మారిన అతను, ఇంటి విషయాల్లో మాత్రం విలన్లా మారాడు అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది.