Sumanth Next Film | టాలీవుడ్ హీరో సుమంత్ హిట్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు మరో హిట్ లేదు. మధ్యలో ‘మళ్ళీరావా’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్న కమర్షియల్గా హిట్టు సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈయన సినిమాలు ఎప్పుడు విడుదలవుతున్నాయో కూడా ప్రేక్షకులకు తెలియకుండా థియేటర్లకు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం ఈయన ‘అనగనగా ఒక రౌడి’ అనే యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇది వరకే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మను యజ్ఞా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది మే నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. కారణాలేంటో తెలియదు గాని ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా రావడం లేదు.
ఇదిలా ఉంటే సుమంత్ తన తదుపరి సినిమాను మరోసారి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్నాడట. గతంలో వీళ్ళ కాంబోలో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే థ్రిల్లర్ డ్రామా చిత్రం తెరకెక్కింది. కమర్షియల్గా ఈ చిత్రం సక్సెస్ సాధించకపోయినా ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని కే. ప్రదీప్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలుపెట్టనుంది. దేవాలయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.