Virupaksha Movie | మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్నాక వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. మరో మూడు వారాల్లో ఆయన నటించిన విరూపాక్ష విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. సినిమా ప్రమోషన్లో భాగంగా సాయిధరమ్ యాక్సిడెంట్ తర్వాత తనకు ఎదురైన పరిణామాల గురించి అభిమానులతో పంచుకున్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు షాక్‌కు గురయ్యానని, దాంతో తన మాట పడిపోయిందని సాయిధరమ్ తెలిపాడు.
దాంతో తను మాట్లాడేవి ఎవరికీ అర్థమయ్యేవి కావని, జనాలకి ఆ విషయం తెలియకపోవడంతో వీడెంటి తాగేసి మాట్లాడుతున్నాడా అని జోకులేసుకున్నట్లు వెల్లడించాడు. కానీ మాట తిరిగి రావటం కోసం తను చాల బాధపడ్డట్లు తెలిపాడు. అలా సడెన్‌గా మాట పడిపోయినప్పుడు దాని వాల్యూ ఏంటో తెలిసిందని సాయితేజ్ చెప్పుకొచ్చాడు. కాగా సాయిధరమ్ ఏడాది కిందట బైక్ ప్రమాదానికి గురయ్యాడు. చాలా రోజుల వరకు హాస్పిటల్, బెడ్‌కే పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన నటించిన విరూపాక్ష ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.
కార్తిక్ దండు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాలో సాయిధరమ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ చేసింది. దీనితో పాటు సాయి తేజ్, పవన్ కళ్యాణ్‌తో కలిసి వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు.